జాతి శ్రేయస్సు కోరే కొందరికైనా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.


Srinu PRO2022/08/14 14:46
Follow
జాతి శ్రేయస్సు కోరే కొందరికైనా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్రం అంటే కేవలం తెల్లదొరలు దిగిపోయి నల్ల దొరల రాజ్యం వెళ్లటం కాదని సాటి మనిషిని ఎందరో మనసు పీడించే సాంఘిక ధర్మం మారడం అని భగత్ సింగ్ ఇచ్చిన సందేశానికి 75 వసంతాలు నిండాయి. ఎవరి ప్రయోజనాలే పరమావధిగా పాలన కొనసాగాలని మహాత్ముడు చెప్పాడో ఆ నిరుపేదల గుండెలలో వెలుగులు చేరకుండానే గడిచిపోయాయి 75 వసంతాలు.

పింగళి వెంకయ్య చేతులలో చిత్రిక చేసుకున్న మువ్వన్నెల జెండా మీదుగా కాషాయం నుండి నుదుటి ఎరుపు దాకా పాలకుల జెండాల లో ఎన్ని వర్ణాలు మారిన పీడిత జనాలలో దగా పడుతున్న బతుకులలో ఈ మార్పులు జరగకుండానే స్వతంత్ర భారతి 75 వసంతాలు పూర్తి చేసుకొని మరో అడుగు ముందుకేసింది.

ఇలా 25, 50 ఏళ్లు 75 ఏళ్లు అని గడిచిన అంకెకు సెల్యూట్ చేస్తున్నాము అంకెల క్రమాన్ని చూసి గర్వపడుతూ పోతున్న మనకు వందేళ్లు కూడా అతి సమీపంలో ఉంది 75 సంవత్సరాలు దాటినా స్వేచ్ఛ స్వతంత్ర భరతావనిలో మన స్వేచ్ఛకి నిజమైన స్వాతంత్రం లభించిందా ?

గాంధీ , సుభాష్ చంద్రబోస్ , అల్లూరి సీతారామరాజు ఇలాంటి అప్పటి మహనీయుల పేర్లు తప్ప మరో నాయకుడు చూడకుండానే 75 ఏళ్ల స్వతంత్ర స్వేచ్ఛ వాయువుని జీవిస్తూ ముందుకు వెళ్తున్నాం స్వతంత్రాన్ని అనుభవించాలనే తన వాణిని వినిపించడానికి సామాన్య సగటు మనిషి పార్లమెంటు వాకిటి వరకు చేర్పించే దెవరు ? మరో మహాత్ముడు ఎప్పుడు వస్తాడు అయ్యో పార్లమెంట్ వరకు అన్నాను ఏంటి మన ఇంటి వాటిని దాటాలి అంటే మన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మన ఎదురుగా ఉన్న ఏ వస్తువు ఎప్పుడు పేలుతుందో నిద్రలో కూడా కలవరింత తెప్పిస్తుంది కాలేజీలకు గుళ్లకు షాపింగ్ మాల్ కి మన ఆడబిడ్డలు తిరిగి ఇంటికి మన ప్రాణాలు అరచేతిలోనె.మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి మన ఇంట్లోనే మన శత్రువు ఉన్నాడు దేశద్రోహుల కు బాసటగా ఉంటున్నాడు. తీవ్రవాదుల తెరలను సైతం పార్లమెంటు గదులకు పంపిస్తున్నాడు.

"ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్న సూక్తిని మన జాతి ఇప్పటి నేతలకు బాగా వంట పట్టినట్టుంది"

ఇది ఇలాగే కొనసాగితే స్వాతంత్రం తర్వాతి మాట తీవ్రవాదం మాత్రం స్వేచ్ఛగా పురివిప్పి ఆడుకోవడం మాత్రం ఖాయం.

స్వాతంత్ర భరతవర్ష వాస్తవ్యుడు ఆ మానవుడు అతికించండి అతని మొహానికి మళ్ళీ చిరునవ్వు అని శ్రీ శ్రీ చెప్పి సరిగ్గా 75 వసంతాలు దాటిన ఈ తరుణంలో 150 కోట్ల భారత వాస్తవ్యులు ముఖం మీద 75 సంవత్సరాల కింద ఉన్నప్పటి బాధలు కంటే ఎక్కువైపోయాయి.హిందూ ముస్లిం భాయి భాయి అన్న పాపానికి godse సాక్షిగా జాతిపిత గుండెను తాకుతూ తన ఉనికిని చాటుకున్న మొట్టమొదటి స్వదేశీ తూటా ఇప్పుడు వట వృక్షమై కోట్ల విధ్వంసకరమైన ఆయుధాలని విస్తరించింది godse కన్నా ఘాతుక కులను లక్షల మందిని తయారు చేసింది దేశంలోని ఎన్నో చోట విధ్వంసాలను సృష్టిస్తూ దేశ చరిత్ర పైన సవాలు విసురుతుంది.


ఇంట్లో మన పూజగదిని శుభ్రం చేద్దాం గాంధీజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు లాంటి చిత్రపటాలను ప్రతిష్ట ఇద్దాం తుపాకుల చుట్టాలను నిర్వీర్యం చేసిన మన సత్యాగ్రహ చరిత్రను రామకోటి ల నిర్మిద్దాం జాతిని సమ సమాజం వైపు జాగృతం చేసేలా ఆజాద్ హిందూ బోస్ నేతాజీ జీవిత విలువలను నిత్య ప్రవచనముల చేద్దాం.

ఇలా ఎందరో భారతావని ముద్దు బిడ్డల జీవితాలను చందమామ కథలకు జోడించి చెబుదాం వందేళ్ల స్వతంత్ర వేడుకలలో స్వేచ్ఛ నింపుకున్న నిజమైన స్వతంత్రాన్ని ఆశిద్దాం ! లేదంటే మన పిల్లలు మనల్ని ప్రశ్నిస్తారు అసలు స్వాతంత్రం అంటే ఏమిటనే ?


ప్రపంచం గాఢనిద్రలో జారుకున్న వేళ 1947 ఆగస్టు 15న నాటి స్వాతంత్రపు లెక్కలు స్వాతంత్రపు రెక్కలు విప్పని స్వచ్ఛమైన స్వేచ్ఛను కూర్చుకున్న ఆ అర్ధరాత్రి మళ్లీ గుర్తుకు తెచ్చుకొని ఆ స్ఫూర్తిని మన ఆత్మలో నింపుకొని మన ఆశలకు స్వేచ్ఛని ఇవ్వలేని ఈ దేశ నాయకుల సర్వసత్తాక స్వతంత్రానికి దూరంగా నిలబడి అప్పుడు చెప్పుకుందాం జాతి శ్రేయస్సు కోరే కొందరికైనా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Follow

Support this user by bitcoin tipping - How to tip bitcoin?

Send bitcoin to this address

Comment (0)